Telugu Jathakam online

Telugu Astrology  Telugu Jathakam  Telugu Jathakam online Astrology in Telugu
27 నక్షత్రములు
1. అశ్వని 2. భరణి 3. కృత్తిక 4.  రొహిని 5. మృగశిర 6. ఆర్ద్ర  7. పునర్వ్సు 8. పుష్యమి 9. ఆశ్రేశ 10. మఖ 11. పుబ్బ 12. ఉత్తర 13. హస్త 14. చిత్త 15. స్వాతి 16. విసాక 17. అనురాధ 18. జేష్ఠ 19. మూల 20. పూర్వాషాడ 21. ఉత్తరాషాడ 22. స్రవన  23. ధనిష్ఠ 24. శతభిష 25. పుర్వాబద్ర 26. ఉత్తరాబద్ర 27. రేవతి .

 

9 గ్రహాలు
1. రవి 2. చంద్ర 3. కుజ 4. రాహు 5. గురువు 6. శని 7. బుద 8. కేతు 9. శుక్ర

 

12 రాసులు
1. మేషo 2. వ్రుషభo 3. మిదునo 4. కర్కాటకo  5. సింహరాశి 6. కన్యరాశి 7. తులరాశి 8. వ్రుచికరాశి 9. ధనస్సురాశి 10. మకరరాశి 11. కుమ్బరాశి  12. మీనరాశి

 

జ్యోతిషం అనే దాని లో జ్యోతి అనే పదానికి వెలుగు లేదా కాంతి అని అర్థం. సరే ఈ కాంతి ఎలాంటిది అని చూస్తే అంతరిక్షం లో ఉండే కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు ఇవి భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం.
అయితే ఈ కాంతి 2 రకాలుగా ఉంది.

1) నక్షత్రాలు, సూర్య,చంద్రులకు సంబంధించిన బయటి కాంతి

2) ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్దీ లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం అర్థమౌతుంది.

కాబట్టి జ్యోతిష శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తున్నది.

అందుకే జ్యోతిష శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం. ఇంత ముఖ్య శాస్త్రం కాబట్టే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి

6 శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండాలి. వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి.
(మిగిలిన 5 శాస్త్రాలు శీక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం).

జ్యోతిష్యం మానవుడికి అవసరమా ? ఇది లేక పొతే జీవించ లేమా ? కేవలం జాతకము ను నమ్ముకొని జీవించటం ఎంతవరకు సమంజసం ? దీని పరిధి యెంత ఏమిటి ? అసలు నమ్మాలా వద్దా ?

ఇలాంటి వాటి గురించి ఆలోచించే ముందు మనం అసలు మనకు జ్యోతిష్యం గురించి ఎంతవరకు తెలుసు అనేది చాల ముఖ్యం . అసలు ఈ శాస్త్రం ఏమిటి ? ఇందులో ఏయే విషయాలు మనకు తెలుస్తాయి ? ఇవ్వని తెలిస్తే నే గదా ! మనం దానిగురించి మాట్లాడ గలిగేది ?

అందుకనే ఈ వ్యాసం లో జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ముందుగా వివరిస్తున్నాను .
మనవ జాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి . మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీన మైనది ఈ జ్యోతిష్యం .

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు ,నక్షత్రం ,కన్ను ,సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి . మనకు అనంత విశ్వంలో కంటికి ఆకాశం లో కనపడే సూర్యుడు ,చంద్రుడు ,నక్షత్రాలు ,కొన్ని గ్రహాలు , తోకచుక్కలు ,గ్రహణాలు ఇవన్నీ ఆకాశం లో చూసి ఆనందించటం తో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది మరియు ఎంతో ఉత్సాహంగా కూడా వుండేది . ఈ నాడు ఆధునిక సమాజం లో టెలిస్కోప్ మరియు ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాల సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు . కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా , విశేషం గా వారిని ఆకర్షించి ,తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి . ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణుల పై వాటి ప్రభావం వాతావరణం లో క్రమబద్ధమైన మార్పులు , వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి
.
హేతు రహిత మయన విజ్ఞానాన్ని ఎవరు విశ్వసించరు . అలాగే సరి అయిన హేతువు లేక పొతే అది అసలు విజ్ఞానమే కాదు . శాస్త్రము అని పించు కోదు . ఒక వ్యక్తి జీవితాన్ని ఈ జ్యోతిష్య శాస్త్రం శాసిస్తోంది . ఆటను చేసే కర్మను ప్రోచ్చహిస్తోంది. నిత్య జీవితం లో ఎలా మెలగాలో తెలియ చేస్తుంది . కాని ఇవన్నీ మనం తెలుసు కొని ఆచరించి నపుడే ప్రయోజనం . ఒక ప్రాంతపు నక్ష దారిచుపుతుంది , ఎన్ని మార్గాలు వున్నాయో తెలుపు తుంది . మార్గంలో ప్రమాద కరమైన ప్రదేశాలు తెలిపి ఏది సులువైన మార్గం కూడా తెలపవచ్చు కానీ ప్రయాణం జాగ్రతగా మనమే చేయాలి కదా ! ఈ విదంగా మనవ జీవనం గురించి తెలియ జేయటం లో జ్యోతిష్య శాస్త్రం ప్రభావం ఎంతో వుంది . సమానమైన కృషి కలిగిన ఇద్దరు వ్యక్తుల జీవిత ఫలితాలలో తేడాను నిరూపించటం లో భౌతిక శాస్త్రము విఫల మైన సందర్భములో జ్యోతిష్యం ఒక్కటే కారణాలను విశ్లేషించి చూపుతుంది అనేది నిజం !

మనకు రోజు అనుభవం లోకి వచ్చే ఒక ముఖ్య విషయాన్నీ  పరిశీలిద్దాము   ……
రాత్రి వేళల్లో రోగ తీవ్రత అధికంగా వుంటుంది అది అందరికి తెలిసిందే . సూర్య కాంతి రావటం తోటే మనిషి లో చైతన్యం వస్తుంది . సూర్య కాంతిలో ఎన్నో ఔషదములు వున్నాయని ఆనాటి నుండి ఈనాటికి అనుభవం లో వున్నా విషయమే . A మరియు D విటమిన్లు సూర్య కంటి నుండే లభ్యమవుతాయి . సూర్య కాంతి లో అంతర్గత తీవ్రత కలిగిన కిరణాలు ఎన్నో మనచుట్టూ వున్నాయి . వాటిలో ముఖ్యమైనవి పరారుణ కిరణాలూ ( infrared) అతినీలలోహిత కిరణాలు (ultra violet ) వున్నాయి . వీటి ప్రభావం మానవుని ఆరోగ్యం పై చాల వుంటుంది .
అందుకనే ” ఆరోగ్యం భాస్కరాధిఛ్చెత్ ” అని శాస్త్రాలు చెబుతున్నాయి .
జీవ కోటి బతక డానికి సూర్యకాంతి చాల అవసరం . సూర్య కాంతి వల్లనే భూమి కి దెగ్గరగా వుండి అతి ప్రభావం చూపే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు . ఒక క్రమపద్ధతిలో సూర్య చంద్రులు పరిభ్రమిస్తుంటారు . చంద్రుడు జలకారకుడు . కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం చంద్రుడు భూమిలో ఒక భాగమని తర్వాత జరిగిన మార్పుల వాల్ల భూమి నుండి విడి పడింది అనేది ఉహ ! ఆ భాగమే పసిఫిక్ ప్రాంతమని చెబుతుంటారు . చంద్రుడు భూమికి దెగ్గరగా వచినపుడు అంటే పౌర్ణమి నాడు సముద్రం అటు పోట్లు ఎక్కువగా వుంటాయి . ఇక మానవ శరీరంలో మూడింట రెండో వంతు నీరే కదా అందుకనే చంద్రుని ప్రభావం మానవుని పైన ఎక్కువగా వుంటుంది . ద్రవ రూపంలోని రక్తం , ప్లాస్మ చంద్రుని ఆకర్షణ వలన అధికంగా ప్రవహిస్తాయి . అందువలన మనస్సు ,ఆలోచనలో ఎన్నో మార్పులు వస్తాయి . అందుకనే పౌర్ణమి నాటి చంద్రుడు ని చుస్తే ఆనందం కలుగుతుంది , మానసిక ఉద్రేకాలు అవి అమావాస్య , పౌర్ణమి రోజులలో ఎక్కువ అని వైద్య శాస్త్రం చెపుతోంది . అందుకనే ” చంద్రమ మనసో జాతః ” అని వేదాలలో చెప్ప బడింది . ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదాలలో చెప్పా బడింది . ఈ విధంగా గ్రహాలు , నక్షత్రాలు ,రాసులు , వీటి ప్రభావం అధికంగా వున్నట్లు తెలుసుకున్నారు.

మీరు ఒక మంచి జ్యొతిష్యుడి ని కలవాలి అని అనుకుంటే ఈ లింక్ ని చూడండి  best astrologer in Hyderabad

admin

type your new pasword here

You may also like...